జనగామ పట్టణంలో ఆర్టీసీ డిపో ఎదుట ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం నిరసన చేపట్టారు. తమ పెండింగ్ బిల్లులు, ఎరియర్స్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని వారు కోరారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని డిపో మేనేజర్‌కు, జిల్లా కలెక్టర్‌కు అందజేశారు.