KMR: భిక్కనూర్ మండలం కాచాపూర్‌లో ఇందిరా మహిళా శక్తి భవనానికి సోమవారం సర్పంచ్ జ్యోతి శంకుస్థాపన చేశారు. ఆమె మాట్లాడుతూ.. ఇందిరా మహిళా శక్తి భవనం మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సంఘం అధ్యక్షురాలు, సీసీ కవిత, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.