AP: ఎప్సెట్ ఫలితాలు జూన్ 1న విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 3,55,803 మంది దరఖాస్తు చేయగా 3,29,474 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఇంజినీరింగ్, ఫార్మసీ (MPC)కి 2,76,576 మంది దరఖాస్తు చేయగా.. 2,58,545 మంది పరీక్ష రాశారు. వ్యవసాయ, ఫార్మసీ (BIPC)కి 79,227 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా.. 70,929 మంది హాజరయ్యారు.