W.G: పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని అజ్జమూరు ఎంపీపీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్.వి.ఎస్. నారాయణ పేర్కొన్నారు. ఆకివీడులో సోమవారం ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ఆయన చెత్తను తొలగించారు. ఆయన మాట్లాడుతూ.. స్వచ్ఛతను ఒక ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాలని, ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.