NLG: అడవిదేవులపల్లిలో ఈ నెల 24 నుంచి జూన్ 1 వరకు జరిగే మహిషాసురమర్ధిని (కనకదుర్గమ్మ) అమ్మవారి జాతరను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్సై శేఖర్ కోరారు. జాతరలో ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా వస్తారని, అందరూ సహకరించాలని కోరారు.