ATP: అనంతపురం కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో ఇవాళ ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల సమస్యలను జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ స్వయంగా అడిగి తెలుసుకుని అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో DRP ఏ.మలోల, జిల్లా ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.