KRNL: ఎమ్మిగనూరు వీవర్స్ కాలనీలో సోమవారం ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ కార్యక్రమం నిర్వహించారు. ఒక రాష్ట్రం, ఒక పరిశుభ్రత లక్ష్యంతో వీధుల స్వీపింగ్, కాలువల పూడికతీత పనులు చేపట్టారు. సేకరించిన చెత్తను మున్సిపల్ వాహనాల ద్వారా తరలించారు. పరిశుభ్రతలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కమిషనర్ గంగిరెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో SHG సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.