హైదరాబాద్లోని 15 అసెంబ్లీ స్థానాల్లో కేవలం 42.82% ఓటర్ మ్యాపింగ్ పూర్తవడం చర్చకు దారితీసింది. ముషీరాబాద్ వంటి ప్రాంతాల్లో ఓటర్లు వివరాలు ఇవ్వడానికి వెనుకంజ వేస్తుండగా, బోగస్ ఓట్ల ఏరివేత పేరుతో జరుగుతున్న ప్రక్రియపై అసంతృప్తి పెరుగుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.