PPM: బక్రీద్ పండుగ సందర్భంగా ఈ నెల 28వ నిర్వహించాల్సిన ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను వాయిదా వేసినట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి నాగేశ్వరరావు తెలిపారు. ఏపి ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యదర్శి పి. రంజిత్ బాషా ఆదేశాల మేరకు పరీక్షల తేదీలలో మార్పు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈనెల 28న, బక్రీద్ పండగ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.