అన్నమయ్య: మదనపల్లెలోని కోర్టు గంగమ్మ ఆలయం తిరుణాలకు ముస్తాబైంది. ఈనెల 26, 27 తేదీల్లో జరిగే తిరుణాల నేపథ్యంలో బండమీద కమ్మపల్లె ప్రాంతాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. ఎన్టీఆర్ కూడలి నుంచి శ్రీకృష్ణదేవరాయల కూడలి వరకు అమ్మవారి చిత్రాలు ఏర్పాటు చేశారు. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణతో పాటు రాయలసీమ జిల్లాల నుంచి భారీగా భక్తులు తరలిరానున్నారు.