TG: రాష్ట్రంలో వైద్య వ్యవస్థ కుప్పకూలిందని మాజీమంత్రి హరీష్ రావు అన్నారు. తాండూరు, భద్రాచలం ఘటనలే ఇందుకు సాక్ష్యమన్నారు. బతికించేందుకు 108 రాదని.. చనిపోతే వాహనాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ తెచ్చిన సేవలను రేవంత్ సర్కార్ మూలనపడేశారని మండిపడ్డారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులున్నా ఏం లాభమని అసహనం వ్యక్తం చేశారు.