AP: తూ.గో.జిల్లా అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ప్రజాప్రతినిధులు, కలెక్టర్ కీర్తి చేకూరి, SP నరసింహ కిషోర్, PCP అధికారులు, క్లీన్ కృష్ణా, గోదావరి మిషన్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోదావరి నదిలో ఎక్కడెక్కడ కలుషిత నీరు కలుస్తుందో అధికారులను అడిగి తెలుసుకున్నారు. పరిశ్రమ వ్యర్థాలపై పీసీపీ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.