సత్తెనపల్లి ఎన్టీఆర్ పార్కులో పోలీసు సిబ్బందికి యోగా సాధన నిర్వహించారు. ఒత్తిడిని తగ్గించుకుని, శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం జరిగింది. యోగా నిపుణుల సమక్షంలో సిబ్బంది పలు ఆసనాలు వేశారు. నిత్యం యోగా చేయడం వల్ల ఏకాగ్రత, విధి నిర్వహణలో సమర్థత పెరుగుతుందని అధికారులు పేర్కొన్నారు.