కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో ఆదిత్య నింబల్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘రఫ్తార్’. గతంలో ఈ చిత్రాన్ని జులైలో విడుదల చేయాలనుకున్నా, తాజాగా వాయిదా పడింది. దసరా కానుకగా అక్టోబరు 16న సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించింది. ఒక కలను నిజం చేసుకోవడానికి ఎంతో కృషి అవసరమని పేర్కొంది.