AP: రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులకు గ్రాండ్ టెస్ట్, తొమ్మిదో తరగతి విద్యార్థులకు SA-2 పరీక్షలు మార్చి 2 నుంచి నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. ఈ పరీక్షలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ను RJDలు, డీఈవోలు క్షేత్రస్థాయి సిబ్బందికి చేరవేయాలని ఆదేశించింది. పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలకు తావు లేకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించింది.