AP: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు ఇవాళ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్నారు. స్పోర్స్ మీట్లో క్రికెట్ ఆడుతూ గాయపడ్డ ఆయన్ను ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. ఎడమ చేతికి గాయం కావడంతో హైదరాబాద్లోని ఏఐజీ ఆస్పత్రిలో శస్త్ర చికిత్స చేయించారు. సర్జరీ పూర్తికావడంతో ఆయన ఇవాళ ఏపీ తిరిగి వచ్చే అవకాశం ఉంది.