వికారాబాద్ జిల్లా పరిగి మండలం మిట్టకాంకోల్ గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ శుభకార్యక్రమంలో బీసీ కులాల ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రాంచందర్ యాదవ్ పాల్గొని, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.