గుంటూరులో నిర్వహించిన ప్రత్యేక గ్రీవెన్స్‌లో జిల్లా కలెక్టర్ C.M. సాయి కాంత్ వర్మ దివ్యాంగులకు ఉపాధి, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. ప్రతి నెల నాలుగో శనివారం ఉద్యోగులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తామని చెప్పారు. స్వయం ఉపాధితో దివ్యాంగులు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని సూచించారు.