MDK: రామాయంపేట మండలం పర్వతాపూర్ గ్రామ పంచాయతీ బాపనయ్య తండాలో ఇటీవల గాలి, వాన బీభత్సానికి కట్రోత్ అమర్‌సింగ్ ఇంటి పైకప్పు ఎగిరిపోవడంతో కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. బాధిత కుటుంబ పరిస్థితిని చూసిన తండా యువకులు కలిసి రూ.4500 ఆర్థిక సహాయం అందించి ఇంటికి రేకులు వేయించేందుకు తోడ్పడ్డారు. యువత సేవా గుణాన్ని గ్రామస్తులు అభినందించారు.