వేసవి తాపం నుండి ఉపశమనం పొందడానికి దుస్తుల రంగుల ఎంపిక చాలా ముఖ్యం. ఎండ తీవ్రతను తగ్గించే తెలుపు, లెమన్ ఎల్లో, మింట్ గ్రీన్, పీచ్ వంటి లేతరంగుల దుస్తులు శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. అలాగే కాటన్, లెనిన్ వస్త్రాలకు ప్రాధాన్యమివ్వాలి. తేలికపాటి చాంబ్రే దుస్తులను ఎంచుకోవడం వేసవిలో ఎంతో ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.