మంచిర్యాల జిల్లా రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం పూర్తి సిద్ధంగా ఉందని అదనపు కలెక్టర్లు రాములు, చంద్రయ్య స్పష్టం చేశారు. కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదంటూ వస్తున్న పుకార్లను రైతులు నమ్మవద్దని అన్నారు. జిల్లాలో ప్రస్తుతం 1.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని భద్రపరిచేందుకు తగిన గోదాములు అందుబాటులో ఉన్నాయన్నారు.