SRCL: ఎల్లారెడ్డిపేట మండలంలోని వెంకటాపూర్ గ్రామ శివారులో షార్ట్ సర్క్యూట్తో ఆంజనేయులుకు చెందిన పౌల్ట్రీ ఫాంతో పాటు 5 ఎకరాల విస్తీర్ణంలోని పశుగ్రాసం దగ్ధమైంది. రేకులు, కోళ్లు కాలిపోగా, సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సుమారు రూ.9 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని బాధిత రైతు తెలిపారు.