AKP: రోలుగుంట కుసర్లపూడి మాజీ సర్పంచ్ గండి సింహాద్రి శుక్రవారం విశాఖలోని పార్టీ కార్యాలయంలో జనసేనలో చేరారు. పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీవీఎస్ఎన్ రాజు సమక్షంలో ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గతంలో జడ్పీటీసీ ఎన్నికల్లో సింహాద్రి కోడలు అరుణక్రాంతి టీడీపీ తరపున వేసిన నామినేషన్ ఉపసంహరించుకోవడంతో వైసీపీ ఏకగ్రీవమైంది.