NDL: ఉమ్మడి కర్నూలు జిల్లాలో వర్షాల ప్రభావంతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 40 డిగ్రీలలోపే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆళ్లగడ్డలో 39.6, పాణ్యం 39.2, సంజామలలో 38.5 డిగ్రీలు నమోదయ్యాయి. శ్రీశైలం, మహానంది, బనగానపల్లిలో 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదుకాగా, రానున్న రోజుల్లో మళ్లీ పెరిగే అవకాశం ఉందని APSDMA హెచ్చరించింది.