ATP: గుత్తి మున్సిపాలిటీ పరిధిలో వార్డుల పునర్విభజన గందరగోళంగా ఉందని వైసీపీ నాయకులు రంగనాయకులు, గురుప్రసాద్ యాదవ్, జీఎం.బాషా, పవన్ కుమార్ అన్నారు. మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియాను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. వార్డుల పునర్విభజనలో తప్పులను సరిదిద్దడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని విన్నవించారు.