WNP: గుట్టు చప్పుడు కాకుండా 12 ఏళ్ల బాలికకు, 23 ఏళ్ల యువకుడికి పెళ్లి చేస్తున్నారని సమాచారంతో శుక్రవారం అర్ధరాత్రి వెళ్లి పెళ్లిని అడ్డుకున్నట్లు ఎస్సై నరేష్ తెలిపారు. వీపనగండ్ల మండలంలోని సంగినేనిపల్లి శివారిలోని లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో పెళ్లి జరుగుతుండగా అడ్డుకున్నారు. ఇరువురు తల్లిదండ్రులతో పాటు పదిమంది పెద్దలపై కేసు నమోదు చేశామని తెలిపారు.