SRPT: సూర్యాపేట మండలం యర్కారంలో రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. మాజీ సర్పంచ్ భర్త, బీఆర్ఎస్ నేత చింతలపాటి మధును దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని సూర్యాపేట ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.