ఏలూరు పత్తేబాదకు చెందిన మానూరి కిషోర్ (37) ప్రైవేట్ ఆస్పత్రిలో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తున్నాడు. నర్సుగా పనిచేసే అతని భార్య మనస్పర్ధలతో పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్థాపానికి గురైన కిషోర్.. హనుమాన్ నగర్ వంతెన వద్ద రైలు కిందపడి శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రైల్వే ఎస్సై కృపాదానం కేసు నమోదు చేశారు.