AP: ఈఏపీసెట్ రాసిన అభ్యర్థులకు కీలక అప్డేట్. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షల ప్రాథమిక కీ ఇవాళ విడుదల కానుంది. విద్యార్థులు అధికారిక వెబ్సైట్ cets.apsche.ap.gov.inలో కీని చూసుకోవచ్చు. సమాధానాలపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే రూ.300 ఫీజు చెల్లించి మే 25 వరకు ఆన్లైన్లో ఫిర్యాదు చేయవచ్చు. కాగా, మే 12 నుంచి 20 వరకు ఈ ఎగ్జామ్స్ జరిగాయి.