RR: మియాపూర్ వీడియో కాలనీలో స్థానికుల అభిప్రాయాలను విస్మరిస్తూ, తగిన భద్రతా చర్యలు లేకుండా చేపట్టిన నాలా పనులపై బీజేపీ నాయకులు నిరసన తెలిపారు. శేరిలింగంపల్లి బీజేపీ ఇంఛార్జ్ రవికుమార్ యాదవ్ ఆదేశాల మేరకు, సీనియర్ నేతలు సమ్మెట ప్రసాద్, లక్ష్మణ్ ఆధ్వర్యంలో కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.