VKB: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ వికారాబాద్లో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వినూత్న నిరసన చేపట్టారు. ఎన్టీఆర్ చౌరస్తా నుంచి బీజేఆర్ చౌరస్తా వరకు ఆటోకు తాడు కట్టి లాగుతూ పెరిగిన ఇంధన ధరలపై ఆందోళన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరల భారం సామాన్య ప్రజల పై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆయన పేర్కొన్నారు.