కడప కార్పొరేషన్లో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు కారుణ్య నియమాకం కింద తక్షణమే ఉద్యోగాలు ఇవ్వాలని సీఐటీయూ నేతలు చంద్రారెడ్డి, వెంకటసుబ్బయ్య డిమాండ్ చేశారు. అడిషనల్ మున్సిపల్ కార్మికులకు కలెక్టర్ ఎస్సార్ రేటు ప్రకారం రూ.18వేల వేతనం ఇవ్వాలన్నారు. రిటైర్అయిన వారికి రూ.15 లక్షల ప్రయోజనాలు కల్పించాలని కోరారు. ఈ సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు దిగుతామన్నారు.