ATP: అనంతపురంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్కు విచ్చేసిన రాష్ట్ర ఎక్సైజ్, గనులు, జియాలజీ శాఖల మంత్రి కొల్లు రవీంద్రకు ఘన స్వాగతం లభించింది. అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర్ ప్రసాద్, ఏపీఎస్ఆర్టీసీ కడప జోనల్ ఛైర్మన్ పూల నాగరాజు ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వెంకటప్ప పాల్గొన్నారు.