కోనసీమ: అధికారులు, ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగా రాజోలులో 2021లో రూ.90 లక్షలు వెచ్చించి నూతనంగా నిర్మించిన రాజోలు ఎమ్మార్వో కార్యాలయ భవనం నిరుపయోగంగా మారింది. 2024 జనవరిలోనే అప్పటి జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు కలిసి ప్రారంభోత్సవం చేసినా.. ఆఫీస్ సిబ్బంది ఎవరు ఈ కొత్త భవనంలోకి మారకపోవడం, నిర్వహణ లోపంతో భవనం గోడలు కూడా అప్పుడే బీటలు తీసాయి.