TPT: సూళ్లూరుపేట నియోజకవర్గంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులపై కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్‌ను ఎమ్మెల్యే డా. నెలవెల విజయశ్రీ శుక్రవారం కలిసి చర్చించారు. రహదారులు, తాగునీరు, మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ పనులు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు. కలెక్టర్ సంబంధిత అధికారులతో సమన్వయం చేసి చర్యలు తీసుకుంటామన్నారు.