విశాఖ: దళితుల సమస్యలపై జీవీఎంసీలో శుక్రవారం గ్రీవెన్స్ నిర్వహించనున్నట్టు ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం ఒక ప్రకటనలో తెలిపారు. భూ సమస్యలు, ఉద్యోగ సంబంధిత సమస్యలు, వివక్ష, అట్రాసిటీ సంబంధించిన ఏ సమస్యలైనా ఫిర్యాదు ద్వారా ఇవ్వవచ్చని ఆయన తెలిపారు.