హాకీ ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై విరాట్ కోహ్లీ చేసిన ప్రశంసలకు టీమిండియా హాకీ స్టార్ మన్‌ప్రీత్ సింగ్ ధన్యవాదాలు తెలిపాడు. RCB ఆటగాళ్లతో కలిసి ట్రైనింగ్ సెషన్లో పాల్గొనాలని ఉందంటూ ‘యో యో’ టెస్టుకు సరదాగా సవాల్ విసిరాడు. క్రికెట్ కూడా క్లిష్టమైన గేమేనని, తమతో ఫిట్నెస్ టెస్టులో పోటీ పడటానికి క్రికెటర్లను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నాడు.