HNK: కాంగ్రెస్ పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేసే పార్టీ అని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. హనుమకొండలో మీడియాతో కావ్య మాట్లాడుతూ.. ప్రజల కష్టాలు తీరుస్తారని నమ్మి కేంద్రంలో బీజేపీకి అధికారం అప్పగిస్తే, యుద్ధ పరిస్థితులను బూచిగా చూపిస్తూ నిత్యావసర వస్తువుల ధరలను పెంచి సామాన్య ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.