JN: జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే సందీప్ కుమార్ ఝాపై పలు వివాదాలు నెలకొన్నాయి. ప్రజావాణిలో ఓ వృద్ధుడికి తక్షణ వైద్య సహాయం అందించి ప్రశంసలు పొందిన ఆయన, అనంతరం తీసుకున్న కొన్ని నిర్ణయాలు విమర్శలకు దారితీశాయి. డీఈవో కార్యాలయం తరలింపు, కలెక్టరేట్ ఎదుట టీ స్టాళ్ల తొలగింపు నిర్ణయాలపై కలెక్టర్కు వ్యతిరేకత వ్యక్తమవుతోంది.