MDK: రామాయంపేట మండల పరిధిలోని లక్ష్మాపూర్ గ్రామ శివార్లలో విలువైన ప్రభుత్వ భూమి కబ్జాదారుల చేతుల్లోకి వెళ్ళిపోతోంది. కళ్ల ముందే సర్కారు భూమి అక్రమార్కుల పరంవుతుండటంతో ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్థులు గురువారం రామాయంపేట తహశీల్దార్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. భూ కబ్జాపై సమగ్ర విచారణ జరిపి, ప్రభుత్వ ఆస్తిని కాపాడాలని వారు గట్టిగా డిమాండ్ చేశారు.