SRCL: ప్రభుత్వ లక్ష్యం మేరకు ఉపాధి హామీ పనులు చేయించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలోని ఊర చెరువులో జల సంచాయ్ – జన్ భాగిదారి కింద ఉపాధి హామీ పనులు కొనసాగుతుండగా.. గురువారం జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. ప్రభుత్వ లక్ష్యం మేరకు కూలీలకు ఉపాధి హామీ కింద ఉపాధి హామీ కల్పించాలన్నారు.