NRML: కడెం మండలంలోని పెద్దూర్, లింగాపూర్, సారంగాపూర్ తదితర గ్రామాల్లో తూకం వేసిన మొక్కజొన్న సంచులను వెంటనే తరలించాలని స్థానిక రైతులు కోరారు. ఈ మేరకు కడెం తహసీల్దార్ మొయినుద్దీన్‌ను కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. రెండు రోజుల్లో మొక్కజొన్న సంచులను తరలించకుంటే రహదారిపై బైఠాయించి ధర్నా చేస్తామని హెచ్చరించారు.