RR: నిజాంపేట్ మున్సిపల్ కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. పెండింగ్ ESI, PF బకాయిలు వెంటనే చెల్లించాలని, కార్మికులను పర్మినెంట్ చేస్తూ కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రమాదాల్లో మరణించే కార్మికులకు రూ.25 లక్షల ఇన్సూరెన్స్ వర్తింపజేయాలని సీఐటీయూ నేతలు ప్రభుత్వాన్ని కోరారు.