VZM: చింతపల్లి సివిల్ సప్లై గోదాములో హమాలీలుగా పనిచేస్తున్న 17 మంది కార్మికులకు గత మార్చి, ఏప్రిల్ నెలల జీతాలు ఇంకా చెల్లించకపోవడంతో గురువారం హమాలీలు బంద్కు దిగారు. మేస్త్రి సత్తిబాబు ఆధ్వర్యంలో కార్మికులు గోదాం వద్ద నిరసన వ్యక్తం చేశారు. తమకు రావలసిన జీతాలను తక్షణమే విడుదల చేయాలని జీసీసీ హమాలీలు కోరారు.