KRNL: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న స్వర్ణాంధ్ర విజన్-2047లో భాగంగా జిల్లాలో అటవీ విస్తీర్ణం 50% పెంచే దిశగా చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ సిరి తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 5న భారీ మొక్కల పెంపక కార్యక్రమంపై అధికారులతో ఇవాళ సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం జిల్లాలో 6% అటవీ విస్తీర్ణం ఉందని అన్నారు.