AP: కార్యకర్తే అధినేత అనేది మహానాడులో ప్రతిబింబించాలి అని CM చంద్రబాబు అన్నారు. ‘మహిళలకు TDP ఇస్తున్నప్రాధాన్యం అందరికీ అర్థమయ్యేలా చాటాలి. సంప్రదాయ ఓటును కాపాడుకోవాలి. జనాభాలో 50 శాతం ఉన్న BCలు పార్టీ ఆవిర్భావం నుంచి వెన్నుదన్నుగా ఉన్నారు. వారి అభివృద్ధికి పార్టీ కట్టుబడి ఉందనే సందేశం స్పష్టంగా వెళ్లాలి. హైబ్రిడ్ విధానంలో నిర్వహించే మహానాడును విజయవంతం చేయాలి’ అని అన్నారు.