E.G: గోకవరంలో రూ. 50 లక్షల విలువ గల సీసీ రోడ్డు పనులను గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మాజీ జడ్పీటీసీ సాలూరి బోసు బాబు, సొసైటీ ఛైర్మన్ సత్తిబాబు కొబ్బరికాయ కొట్టి సీసీ పనులను మొదలపెట్టారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆదేశాల మేరకు నిర్మాణాలను ప్రారంభించామన్నారు. గ్రామాల్లో మౌలిక వసతులకు కూటమి కృషి చేస్తుందని చెప్పారు.