WGL: పర్వతగిరి మండల కేంద్రంలో స్వేరోస్ మండల కమిటీ ఆధ్వర్యంలో మహాన్యూస్ ఛైర్మన్ వంశీకృష్ణపై గురువారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కుటుంబాన్ని ఉద్దేశించి నిర్వహించిన పోల్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి చర్యలు పునరావృతమైతే నిరసనలు చేపడతామని హెచ్చరించారు.