GDWL: జిల్లాలో మొక్కజొన్న కొనుగోళ్లు ప్రక్రియను సజావుగా నిర్వహించి ఈ నెల 26లోగా పూర్తిచేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. గూగుల్ మీట్లో మాట్లాడిన ఆయన గద్వాల, అయిజ, క్యాతూరు కేంద్రాల్లో నిల్వలు ఎక్కువగా ఉన్నందున అదనపు లారీలు, గోదాములు ఏర్పాటు చేయాలన్నారు. అలాగే ఈనెల 22న జరిగే ప్రజాపాలన ప్రగతి ప్రణాళికను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.