KMR: నిజాంసాగర్ మండలం సుల్తాన్నగర్లో ఈ నెల 26న బారేడు పోచమ్మ బోనాలు వైభవంగా నిర్వహించనున్నారు. అనంతరం 27న భారీ కుస్తీ పోటీలు జరగనున్నాయి. పోటీల్లో పాల్గొనదలచిన కుస్తీ వీరులు హాజరుకావాలని సర్పంచ్ వడ్ల బ్రహ్మం కోరారు. ఈ కార్యక్రమానికి వచ్చే వారికి మధ్యాహ్న భోజన సదుపాయం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.